calender_icon.png 5 February, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బాగాంధీ పాఠశాలను తనిఖీ చేసిన మండల్ స్పెషల్ ఆఫీసర్

05-02-2025 04:11:54 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా డిడబ్ల్యూవో, మండల స్పెషల్ ఆఫీసర్ హైమమతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె ఈ సందర్బంగా మాట్లాడతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్నటువంటి పంట గదిని సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే విద్యార్థులు చక్కగా చదువుకొని మంచిపేరు తేవాలని వారు విద్యార్థులకు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.