24-02-2025 08:49:57 PM
ఎర్గట్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను మండల ప్రత్యేక అధికారి (ఆర్మూర్ DLPO) పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని, తరగతి గదులను, ఫిర్యాదుల పెట్టెను, సరఫరా చేయబడిన భోజన సామాగ్రిని, సిబ్బంది హాజరును పరిశీలించి, 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ పై శ్రద్ద చూపాలని సూచించారు.