పాపన్నపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా పాపన్న పేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన పైతర యాదగిరి(Paithara Yadagiri) ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) నుండి డాక్టరేట్(Doctorate) పొందారు. ఈ డాక్టరెట్ పట్టాను యూనివర్సిటీ మాజీ ఎడ్యుకేషన్ డీన్. పి. వెంకట్ రెడ్డి చేతులమీదుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్(Physical Education Department)లో శుక్రవారం అందుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఏడ్యూకేషన్ విభాగంలో పరిశొధన చేసినందుకు గాను యూనివర్సిటీ అధికారులు డాక్టరేట్ ని ప్రదానం చేశారు. ఏ స్టడీ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఫిజికల్ ఫిట్నెస్ అమాంగ్ గురుకుల స్కూల్స్ స్టూడెంట్స్ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అనే అంశం మీద అరేండ్లు గా పరిశోధన చేశారు.
మలి దశ ఉద్యమంలో నిజాం కాలేజీ నుండి ఓయు జేఏసీ నేతగా పోరాడి, తెలంగాణ రాష్ట్రం సిద్దించేలా తన వంతు పాత్ర పోషించారు. యూనివర్సిటీ మాజీ ఎడ్యుకేషన్ డీన్ పి. వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ విద్యా విభాగంలో డాక్టరేట్ సాదించేందుకు సహకరించిన యూనివర్శిటీ ప్రోపెసర్లకు, అధికారులకు, యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ లకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, కుర్తివాడ గ్రామ ప్రజలందరికి ఈ సందర్బంగా అయన కృతజ్ఞతలు తెలిపారు