07-03-2025 04:57:43 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని జేత్రం తండలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వారి ఆదేశాల మేరకు 10 లక్షల సీసీ రోడ్ పనులను చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల సురేష్,తండ నాయకులు హనుమంతు,లక్ష్మణ్,రమేష్,టిక్య పాల్గొన్నారు