calender_icon.png 28 April, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తల సమక్షంలోనే మండల అధ్యక్షున్ని ఎన్నుకోవాలి

27-04-2025 01:56:22 PM

నిజాంసాగర్ మండలం బిజెపి కార్యకర్తలు                

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలం(Nizamsagar Mandal)లోని అన్ని గ్రామాల బీజెపి పార్టీ కార్యకర్తల సమక్షంలోనే నిజాంసాగర్ మండలం బిజెపి పార్టీ మండల అధ్యక్షున్ని ఎన్నుకోవాలని నిజాంసాగర్ మండల బిజెపి పార్టీ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీ బీ పాటిల్,మాజీ శాసన సభ్యురాలు అరుణ తారకు విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాములు సెట్, నిజాంసాగర్ మండల పార్టీ ఇంచార్జ్ కృష్ణ పటేల్ కు వినతిపత్రం సమర్పించారు. మండల పార్టీ కార్యకర్తల మనోభావాల మేరకు ఆదివారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించి పోరిటి అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు.మండల పార్టీ అధ్యక్షుని ఎన్నుకొని, నిజాంసాగర్ మండలంలో బిజెపి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తల కోరారు.