calender_icon.png 31 March, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిసి రోడ్డు పనులు ప్రారంభం

28-03-2025 06:45:29 PM

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామంకు వెళ్లేందుకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ ప్రారంభించారు. శుక్రవారం గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులనుండి రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎమ్మెన్నార్ ఈజీఎస్, డిఎం ఎఫ్టి నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి గ్రామస్తుల కు అందుబాటులోకి తీసుకు రారు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ రాజ్ ఏఇ ఇసాక్, సారంగపల్లి మాజీ సర్పంచులు ఆసంపల్లి రాజయ్య, పెద్దపల్లి చంద్రకళ, నాయకులు తాజోద్దీన్, ముఖిద్, ఎగుడ రాయమల్లు లు పాల్గొన్నారు.