calender_icon.png 19 April, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీరు, రాజీవ్ యువ వికాసం అమలుపై మండల స్థాయిలో సమీక్షలు

16-04-2025 08:44:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తాగునీటి, రాజీవ్ యువ వికాసం అమలు తీరుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి, ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు గ్రామస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై ప్రభుత్వ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీలతో పాటు 1,320 గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులకు లేకుండా స్థానిక నీటి వనరులను గుర్తించి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వివిధ మండలాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన జిల్లా స్థాయి అధికారులు మరియన్న, నరసింహమూర్తి, డాక్టర్ కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, సురేష్, శ్రీనివాస్, వీరన్న పాల్గొన్నారు.