17-03-2025 12:00:00 AM
బూర్గంపాడు,మార్చి15(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని బ్రిలియంట్ హై స్కూల్ నందు ఆదివారం నిర్వహించిన మండల స్థాయి జికే టాలెంట్ టెస్ట్ కు అనూహ్య స్పందన లభించింది.మండలంలోని వివిధ పాఠశాలల నుండి 3వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ స్కూలు అండ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ బిఎన్‌ఆర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించామన్నారు.మున్ముందు పోటీ పరీక్షలు రాయబోవు విద్యార్థులకు మాథ్స్,సైన్స్,సబ్జెక్టులో ఇంకా ఎక్కువ పట్టు సాధించేలా ఈ పరీక్ష ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని తమ పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు.ఈ టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అంగరంగ వైభవంగా జరిగే బ్రిలియంట్ స్కూల్ డే రోజున ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానం చేయనునట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.