31-03-2025 08:36:46 PM
మునుగోడు (విజయక్రాంతి): సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైయీ సోమవారం ఆయన స్వగ్రామం మునుగోడు మండల పరిధిలోని ఎలగలగూడెం వచ్చారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్సీ సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు, మాజీ జెడ్పిటిసి జాజుల అంజయ్య గౌడ్, చండూర్ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, మాజీ సర్పంచులు జాల వెంకన్న, తాటికొండ సైదులు, నకిరికంటి యాదయ్య, జక్కల శ్రీను, జాజుల సత్యనారాయణ, జాజుల స్వామి, నడింపల్లి యాదగిరి, మేడి యాదయ్య, అప్పారావు, కుమ్మం చెన్నారెడ్డి, మందుల సైదులు, రామ్ రెడ్డి, బొల్లం మహేష్, తీగల స్వామి, ముంత హేమంత్, బీసం కృష్ణ, జక్కలి మల్లేష్ ఉన్నారు.