సౌకర్యాలు, గెజిట్ లేకుండా మండలం ఏర్పాటు చేసిండ్రు
నూతన ఎంపీడీవో ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి...
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలు అతి త్వరగా పరిష్కరించేందుకు మండల కేంద్రాన్ని ఏర్పాటు చెస్ చెబితే ఎలా సరిపోతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కౌకుంట్ల మండల కేంద్రంలో నూతన MPDO ఆఫీస్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీవో ఆఫీస్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకుగాను ప్రజలు కౌకుంట్లను మండల కేంద్రంగా కోరితే సౌకర్యాలు కల్పించకుండా గెజిట్ లేకుండా మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రజలు కోరారని మండల కేంద్రంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు మంచి చేయడం బిఆర్ఎస్ కు తెలియదన్నారు.
దీంతో ప్రజలు మండల కేంద్రంలో కార్యాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి వెంటనే గెజిట్ చేయించుకుని, కౌకుంట్లలో ఎంపీడీవో కార్యాలయం భువన నిర్మాణం చేసి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. మునుముందు ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రజల సుఖసంతోషాలతో జీవించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, కురుమూర్తి స్వామి ఛైర్మెన్ గోవర్దన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, మండల ఓబీసీ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.