15-04-2025 06:56:46 PM
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల విద్యాశాఖ అధికారి దేవి సింగ్ మంగళవారం రోజు మద్దెల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ప్రదర్శనను పరిశీలించారు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పరీక్షలు పూర్తయిన తర్వాత మార్కులను వెంటనే ఆన్లైన్‌లో నమోదు చేయాలని, విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు త్వరగా అందించాలని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంఖ్యా నాయక్, ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, అరుణ్ కుమార్, శ్రీనివాస్, హన్మాండ్లు, లావణ్య తదితరులు అధికారితో కలిసి పాఠశాల విషయాలపై చర్చించారు.