24-03-2025 06:50:48 PM
పాపన్నపేట: మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాపన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొత్తలింగాయిపల్లికి చెందిన కొత్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా బెజుగం విఠలేశ్వర్, కోశాధికారిగా గడ్డం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా సంఘం మండల కమిటీ అధ్యక్షురాలిగా కొత్త సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, కోశాధికారిగా జ్యోతి ఎన్నికయ్యారు.
అధ్యక్షుడు వెంకటేశం మాట్లాడుతూ... సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘ నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సమావేశంలో కొత్తపల్లి, పాపన్నపేట, చీకోడ్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గుప్త, మల్లేశం, దత్తరాజు, పాపన్నపేట గ్రామ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ గుప్త, సంఘం నాయకులు అశోక్, రాజ్ కుమార్, రవీందర్, శ్రీనివాస్, రాములు తదితరులున్నారు.