02-04-2025 08:43:53 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో విట్టళేశ్వర ఆలయంలో బుధవారం అంగీర్గ పద్మ, దుబాయ్ విట్టల్ గౌడ్ దంపతుల పెద్ద కుమారుడు అంగీర్గ సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలదార స్వాములకు మండల భిక్ష బుధవారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి అభిషేకం, హనుమాన్ మాలదారులు పూజా కార్యక్రమం నిర్వహించి ఆంజనేయ స్వామి వారికీ నైవేద్యం సమర్పించి భిక్షనూ స్వీకరించారు. భిక్ష అనంతరం స్వాములకూ పండ్లు పంపిణి చేశారు. కుటుంబ సభ్యులకు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని హనుమాన్ స్వాములు ఆశీర్వదించారు.