calender_icon.png 23 March, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాలను పరిశీలించిన ఏఓ

22-03-2025 05:49:12 PM

దండేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో శుక్ర వారం సాయంత్రం కురిసిన అకాల వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను మండల వ్యవసాయాధికారి ఆంజిత్ కుమార్ శనివారం తిరిగి పరిశీలించారు. సుమారు 80 ఎకరాల్లో మొక్క జొన్న పంటకు  నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనా నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏవో తెలిపారు. ఏఓ వెంట ఏ ఈ ఓ, రైతులు ఉన్నారు.