calender_icon.png 21 February, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మండల వ్యవసాయ శాఖ అధికారి

20-02-2025 02:21:29 PM

రూ 30వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఏవో 

అశ్వాపురం/బూర్గంపాడు,(విజయక్రాంతి): పత్తి కొనుగోలు(Cotton Purchase) చేయాలంటే పైసలు సమర్పించుకోవాల్సిందే. అడిగినంత ఇవ్వకుంటే కూపన్ జారే చేయడం కుదరదు, రూ.30వేలు ఇస్తే కూపన్ ఇస్తానంటూ మండల వ్యవసాయ శాఖ అధికారి(Agriculture Department officer) డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీను ఆశ్రయించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో రైతు తన పండించిన పంటను విక్రయించాలంటే వ్యవసాయ శాఖ అధికారి నుంచి కూపన్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా మండల వ్యవసాయ అధికారి సాయి శాంతన్ కుమార్ రూ.30వేలు డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. గురువారం వ్యవసాయ శాఖ అధికారికి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డిఎస్పి వై రమేష్ ధ్రువపరిచారు. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరుకుతూనే ఉన్నారు. అయినా అధికారులు ఎలాంటి మార్పు రావడం లేదు.