calender_icon.png 25 February, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మందకృష్ణ వైఖరిని వెల్లడించాలి...

24-02-2025 09:08:33 PM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతా..? లేక ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా మాదిగలను వెన్నుపోటు పొడిచిన బిజెపి వైపా..? మంద కృష్ణ మాదిగ వెల్లడించాలని లేదంటే తన మద్దతు ఏ పార్టీకో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగలకు చిరకాల కోరిక అయిన మూడు దశాబ్దాలకుపైగా జరిగిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చరమగీతం పాడుతూ ఈ రాష్ట్రంలో మాదిగలకు 9.75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ ఆమోదం తెలియజేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృష్ణ మాదిగ ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతు ప్రకటించాలని అన్నారు.

కృష్ణ మాదిగ లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమం చేపడితే తాము అదే రోజు సూటు బూటు కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం చేతిలో పట్టుకుని రావాలని పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాపోలు రాములు, బుదాల బాబురావు, డా.మీసాల మల్లేశం, డా.నండ్రు నరసింహ, కనకం వంశీ, బోరెల్లి సురేష్ మాదిగ, తిమ్మల నవీన్ రాజు, ఎర్రమళ్ళ మొగులయ్య, జెర్రీపోతుల సాయన్న, దేవరకొండ నరేష్, జోగు గణేష్ పాల్గొన్నారు.