calender_icon.png 11 March, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగ రిలే దీక్ష

11-03-2025 01:04:47 AM

ప్రతి ఉద్యోగ నోటిఫకేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టం తేవాలని డిమాండ్

ముషీరాబాద్, మార్చి 10: మార్చి 12 నుంచి జరగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చే శారు.

ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యో గ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని డి మాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌సీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంద కృ మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్‌లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఆగస్టు 1న అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గతం లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో వర్గీకరణ ప్రకా రం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సా ధ్యం కాదని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం తప్పన్నారు. 2004కు ముందు వర్గీ కరణ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్‌లు రా గా సుప్రీం కోర్టు 2004లో వర్గీకరణ అనుకూల తీర్పును అమలు చేయడానికి మాత్రం కొర్రీలు పెడుతున్నారన్నారు. అప్పుడు ఇ ప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నద న్నారు. ఎస్సీ ఉద్యోగాలను మాలలకు దోచిపెట్టడమే కాంగ్రెస్ విధానమన్నారు.