10-03-2025 11:06:20 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రంలో ఒకలా, ఏపీలో మరొకలా ద్వంద వైఖరితో ఉన్నాడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆంధ్ర, తెలంగాణ మాదిగ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారిగా వర్గీకరణ అంటే కనీసం ఒక్కరోజు స్పందించలేదని, ఇక్కడ మాత్రం మౌనంగా ఉండి ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో జిల్లా వారిగా వర్గీకరణ చేయాలని కొత్త డిమాండ్‌తో ముందుకు వెళ్తున్నాడని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఎంత శాతం రిజర్వేషన్ అనకుండా మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని మాదిగలకు అన్యాయం చేయబోతున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ ఏడు శాతం రిజర్వేషన్ మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృపాకర్ మాదిగ, ఏపీ అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వర్ రావు, దండు వీరయ్య, మేరీ మాదిగ, సతీష్ మాదిగ, రాయికంటి రాందాస్, బూదాల బాబురావు, డాక్టర్ మీసాల మల్లేశం, డాక్టర్ సండ్రు నరసింహరావు, బోరెల్లి సురేష్, బోయిని ఎల్లేష్ మాదిగ, నక్క మహేష్, నరేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.