హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తోందని 2004లో నవంబర్ 5న చెప్పానని మందకృష్ణ గుర్తుచేశారు. అధర్మమే తాత్కాలికమైన.. ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పానన్నారు. న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఏళ్లుగా పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.