హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో ఎమార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ శనివారం భేటీ అయ్యా రు. రమణ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు అనుమతిచ్చారు. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి సీజేఐగా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి పంపారు. ఎస్సీ వర్గీకరణ కేసును ఉన్నత న్యాయస్థానంలో అనుమతించినందుకు మంద కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ కోసం 30 ఏళ్లపాటు ఉద్యమించిన ఆయన బృందాన్ని ఎన్వీ రమణ అభినందించారు.