కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున దిగ్బంధాలు ఉద్యమా కార్యక్రమాలు ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ధర్మ యుద్ధ మా సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 59 కులాల ఆస్తి ఒకరికి కావాలంటే ఇది న్యాయమా ధర్మమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి చెప్పినా ప్రధానమంత్రి చెప్పిన ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పిన వినలేరు 59 కులాల ఆస్తి ఒకరే ఒకరికి కావాలంటే అది న్యాయమా సమానత్వం 59 కులాల వాటా అందించాలని ఆనాడే అంబేద్కర్ కలను నిజం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. త్వరలో ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయంకు కట్టుబడి ఉండాలని మాదిగలకు పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి మాదిగలకు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారని అన్నారు. సమానత్వం అంటే 59 కులాలకు వాటాను అందించాలని అప్పుడే సమానత్వం అవుతుందని మందకృష్ణ అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాలని కోరారు. ధర్మంగా పోరాడడం వల్లనే ఇన్ని సంవత్సరాలు పట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి ఇన్చార్జి మైలారపు బాలు, మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, సత్తి గాడి లక్ష్మి, జిల్లా సీనియర్ నాయకులు కుంటుల్ల యాదయ్య, సామెల్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్,పోశెట్టి పురుషోత్తం, బాలరాజు, పద్మారావు, లావణ్య, బట్ట రమేష్, పొంగల భూమేష్, రాజ నరసయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.