మంత్రివర్గ విస్తరణలో దామోదరను తప్పించాలి: మంద కృష్ణ
మాదిగలకు వాటా రాబట్టడంలో మంత్రి దామోదర విఫలం:
మంత్రులుగా నలుగురు రెడ్లు ఉన్నారు.. మాదిగలు ఇద్దరుంటే తప్పేంటి?
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ(SC Classification) విధానంలో లొసుగులను సరిదిద్దాలంటూ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మరోసారి పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని, దానికి అనుకూలంగా నివేదికలు సమర్పించిన అనేక కమిషన్లను ఎత్తిచూపారు. మాదిగ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణ ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయబద్ధంగా తమకు 10.50 శాతం వాటా రిజర్వేషన్లు రావాలన్నారు.
కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో తమకు 9 శాతమే దక్కుతుందన్నారు. 15 శాతం ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారని చెప్పారు. 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీ(Distribution of Reservations)లో లోపాలు సరిదిద్దాలని కోరారు. తమకు రావాల్సిన రిజర్వేషన్ల కంటే 2 శాతం తక్కువ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదిక తీసుకున్నా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని సూచించారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారు. పంబాల అనే కులం గతంలో అడ్వాన్స్ డ్ కేటగిరిలో ఉండేది.. ప్రస్తుతం పంబాల కులాన్ని వెనుకబడిన కేటగిరిలో చేర్చారు. 1000 జనాభా ఉన్న పంబాల కులంలో 100 మంది ఉద్యోగులు ఉన్నారు.
15 రోజుల తర్వాత సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామని మందకృష్ణ పేర్కొన్నారు. మాదిగలకు వాటా రాబట్టడంలో మంత్రి దామోదర(Minister Damodar Raja Narasimha) విఫలం అయ్యారుని ఆయన మండిపడ్డారు. దామోదరను మాదిగ ప్రజాప్రతినిధిగా చూడట్లేదని మందకృష్ణ విమర్శించారు. దామోదర రాజనర్సింహ ఎవరి ప్రతినిధో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో దామోదరను తప్పించాలని మందకృష్ణ కోరారు. దామోదర స్థానంలో ఇద్దరు మాదిగలకు అవకాశమివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులుగా నలుగురు రెడ్లు ఉన్నారు.. మాదిగలు ఇద్దరుంటే తప్పేంటి? అని మందకృష్ణ ప్రశ్నించారు. మాదిగల నిష్పత్తి కంటే వాటా తగ్గిందని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి తెలుసు అని ఆయన వివరించారు. వర్గీకరణలో మాదిగలకు రిజర్వేషన్ తగ్గడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.