calender_icon.png 11 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పింఛన్‌లు పెంచడం లేదు

04-01-2025 11:40:23 PM

చేయూత పింఛన్‌దారులను మోసం చేస్తుంది: మందకృష్ణ మాదిగ

మలక్‌పేట,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా చేయూత పింఛన్‌దారులను నట్టేట ముంచుతున్నారని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ(MRPS Founding President Manda Krishna Madiga) అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్‌దారుల ఆగ్రహాన్ని గురికావల్సి వస్తుందని, తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని అన్నారు. సర్ లూయి బ్రయిలీ 216వ జయంతోత్సవాలను పురస్కరించుకుని మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీయస్, వీహెచ్‌పీఎస్‌ల ఐక్య ఉద్యమం వలన దేశంలో ఎక్కడా లేని విధంగా మలక్‌పేటలో బ్రెయిలీ పార్క్, కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పింఛన్‌లను పెంచకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కావాలని కాలయాపన చేస్తుననారని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పింఛన్‌లను పెంచి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్ నాయకులు అందె రాంబాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.