calender_icon.png 8 October, 2024 | 7:49 PM

మాలలకు అనుకూలం.. మాదిగలకు అన్యాయం

08-10-2024 04:15:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే పోస్టులను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. వర్గీకరణ లేకుండానే 11 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి ధర్మా చేయాలని, అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నాలు చేయాలని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని మందకృష్ణ సూచించారు.  హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీకి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చి, మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు నమ్మకద్రోహం చేసిందని మందకృష్ణ విమర్శించారు.