calender_icon.png 9 October, 2024 | 6:57 PM

ఎమ్మార్పీఎస్ ర్యాలీ.. మందకృష్ణ మాదిగ అరెస్టు

09-10-2024 04:06:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి):  ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం పార్సిగుట్టలో ఉన్న ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీని చేప్పట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ముందస్తూ అనుమతి లేకపోవడంతో ఇందిరా పార్క్ వద్దకు ఎమ్మార్పీఎస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర తోపులాట జరిగింది.

దీంతో ఎమ్మార్పీఎస్ శ్రేణులను పోలీసుల అదుపులోకి తీసుకుని మందకృష్ణ మాదిగను అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ శ్రేణులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకోవడంతో మాదిగ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. డీఎస్సీ భర్తీలో కూడా మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, మాలలకు లబ్ధి చేకురుస్తుందని మందకృష్ణ మాదిగ ఆరోపణలు చేశారు.