దశ దినకర్మలో ప్రముఖుల నివాళి
ఎల్బీనగర్, జనవరి 20 : మాజీ ఎంపీ, స్వర్గీయ మందా జగన్నాధం చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రముఖులు నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం దశ దినకర్మ కార్యక్రమాన్ని సోమవారం హస్తినాపురంలోని కేకేఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మాజీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్ చార్జి మధుయాష్కీగౌడ్ తదితరులు మందా జగన్నాథం చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.