calender_icon.png 13 January, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందా జగన్నాథం కన్నుమూత

13-01-2025 02:05:24 AM

  1. ‘సాగర్’ దినసరి కూలీగా ప్రయాణం
  2. చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి..
  3. వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నిక
  4. గత కొంతకాలంగా అనారోగ్యం.. చికిత్స పొందుతూ మృతి
  5. తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి

హైదరాబాద్/ వనపర్తి/నాగర్‌కర్నూల్, జనవరి 12 (విజయక్రాంతి): సీనియర్ పొలిటికల్ లీడర్, మాజీ ఎంపీ మందా జగన్నాథం (74) కన్నుమూశారు. గుండెతో పాటు శ్వాసకోశ సంబంధిత రుగ్మతలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసు పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు సోమవారం సంతోష్‌నగర్ ధోబీ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్న ట్లు సమాచారం.

ఆయనకు ఇద్దరు కుమారు లు, కూతురు ఉన్నారు. ఉమ్మడి మహబూబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా రాజకీయా లతో ఆయనకు విడదీయరాని అనుంబం ధం ఉంది. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో దినసరి కూలిగా పనిచేసిన ఆయన పెద్ద రాజకీయ నేతగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఆయన స్వస్థలం ప్రస్తుత జోగ ళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామం.

పెద్దపుల్లయ్య, సవారమ్మ దంపతుల మొదటి సంతానంగా జగన్నాథం 1951 మే 22న జన్మించారు. తండ్రి నాగార్జున సాగర్‌లోని పైలాన్ కాలనీ మెకానికల్ విభాగంలో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. తల్లి ఆఫీస్ అటెండెంట్‌గా పని చేసేది. పాఠశాల విద్య సమయంలోనే జగన్నాథం టెన్ని స్ బాల్ పికప్ బాయ్‌గా క్రీడాకారులకు సేవలందించారు.

తర్వాత నాగార్జున సాగర్ నిర్మాణంలో రోజు కూలీగా పనిచేశారు. పాఠశాల విద్య స్వగ్రామంలో సాగించిన ఆయన ఉస్మానియా వర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. 

రాజకీయ ప్రస్థానమిది..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 1996లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదే ఏడాది నాగ ర్‌కర్నూల్ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. రెండేళ్ల పాటు ఎంపీగా సేవలందించారు. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి వరుసగా 1999, 2004, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

ప్రత్యేక తెలంగాణ నినాదంతో 2014న ఆయన టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇదే ఏడాది నాగర్ కర్నూల్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ టికెట్ రాలేదు. 2023 ఎంపీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ గూటి కి చేరారు. కాంగ్రెస్ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన భంగపాటుకు గుర య్యారు.

గతేడాది ఏప్రిల్ 18న బీఎస్పీ అధినేత్రి మాయవతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఎంపీ అభ్యర్థిగా బరిలో కి దిగేందుకు నామినేషన్ వేయగా, స్క్రూట్నీ లో నామిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి అనారోగ్యం పాలయ్యారు. కొద్దిరోజుల క్రితమే గుండె, కిడ్నీలు ఫెయిల్ కాగా, ఇటీవల హైబీపీ, డయాబెటిస్ రుగ్మతలు తీవ్రమయ్యాయి.

దీంతో కుటుం బ సభ్యులు నిమ్స్‌లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అక్కడ పరిస్థితి విషమించి కాలం చేశారు. మందా జగన్నాథం మృతి పట్ల కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జగన్నాథంతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ దళిత కుటుంబంలో పుట్టి పార్లమెంట్ సభ్యుడిగా నాలుగుసార్లు సేవలందించిన తీరును కొనియాడుతున్నారు.

రాష్ట్ర ఏర్పాటులో క్రీయాశీలక పాత్ర: సీఎం రేవంత్ రెడ్డి

మందా జగన్నాథం మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో మందా జగన్నాథం క్రియా శీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఎంపీగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడా రు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు.

రాజకీయాల్లో తనదైన ముద్ర: ఏపీ సీఎం చంద్రబాబు

మందా జగన్నాథం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదవులు చదివిన జగన్నాథం టీడీపీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్రవేశారన్నారు. 

తెలంగాణ రాజకీయవేత్తను కోల్పోయింది: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

మందా జగన్నాథం కన్నుమూత తెలంగాణ సమాజానికి తీరని లోటు అని,  రాష్ట్రం ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచా రం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జగన్నాథం కీలక పాత్ర పోషించారని కొనియాడారు.