09-04-2025 12:57:47 AM
విష్ణు జల్‌పల్లిలోని ఇంట్లోకి చొరబడి చోరీ చేశారని ఆరోపణ
రాజేంద్రనగర్, ఏప్రిల్8: తన యజమాని మంచు మనోజ్ కారు చోరీకి గురైందని ఆయన డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం.. ఈనెల 1వతేదీన అర్ధరాత్రి తర్వాత 12.15 గంటలకు మంచు మనోజ్ డ్రైవర్ సాంబశివరావు నార్సింగి పోలీసులకు ఫిర్యా దు చేశాడు. రాత్రి 11.10 గంటలకు నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముప్పా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తి గేటు బజర్ శబ్ధం మోగించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఓ గుర్తుతెలియని వ్యక్తి గేటులో నుంచి మహేంద్రా మ జారో కారును అపహరించుకుపోయినట్లు తెలిపాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చోరీ ఘటన జరిగిన రోజు కూతురు బర్త్‌డే వేడుకల కోసం మంచు మనోజ్ రాజస్థాన్ జైపూర్ వెళ్లినట్లు మంచు మనోజ్ తెలిపారు.
ఇంట్లోకి చొరబడ్డారు
ఇదిలా ఉండగా మంచు మనోజ్ మంగళవారం ముప్పా విల్లాస్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను 1వ తేదీన తన కూతురు బర్త్‌డే కోసం జైపూర్ వెళ్లినట్లు చెప్పారు. తాను ఇక్కడ లేనప్పుడు జల్‌పల్లిలోని ఇంట్లోకి విష్ణుతోపాటు మరో 150 మంది చొరబడ్డారని ఆరోపించారు. తన గదులు ధ్వంసం చేసి తన వస్తువులు, తన పిల్లల వస్తువులు పగులగొట్టారని తెలిపారు. విష్ణు కోర్టును తప్పుదోవ పట్టించి ఆర్డర్ తీసుకొచ్చారన్నారు. జల్‌పల్లిలో నుంచి తన కారు తోపాటు తన భార్య కారు తీసుకొచ్చినట్లు ఆరోపించారు. అదేవిధంగా నార్సింగి లోని ఇంట్లోకి వచ్చి కారును అపహరించారని తెలిపారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ న్నారు. డ్రైవర్లు, సెక్యూరిటీ ఉండగా చోరీ చేశారని అన్నారు. తాను ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపినట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.