09-04-2025 12:36:35 PM
కుటుంబంతో కలిసి జల్‌పల్లి నివాసానికి మంచు మనోజ్
మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో భారీ పోలీసు బందోబస్తు
గతకొన్ని రోజులుగా బయట ఉంటున్న మనోజ్
తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని ఆరోపణ
హైదరాబాద్: మంచు కుటుంబం(Manchu Family)లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కుటుంబంతో కలిసి మంచు మనోజ్ జల్‌పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి వద్దకు వెళ్లాడు. మనోజ్ ను మోహన్ బాబు ఇంట్లోకి అనుమతించకపోవడంతో గేటు ముందే భైఠాయించాడు. గత కొన్ని రోజులుగా మనోజ్ బయట ఉంటున్న విషయం తెలిసిందే. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని మనోజ్ చెబుతున్నాడు. తన కారు పోయిందని మనోజ్(Manchu Manoj) నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కారును సోదరుడు మంచు విష్ణు తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపించాడు.
మంచు మనోజ్ వస్తున్నాడన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచు విష్ణు ఫిర్యాదు ప్రకారం, అతను తన భార్యతో కలిసి వారి కుమార్తె పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి రాజస్థాన్‌కు వెళ్లాడు. వారు లేని సమయంలో, మంచు విష్ణు అతని సహచరులు చట్టవిరుద్ధంగా తన ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారని అతను ఆరోపించాడు. ఇంట్లో ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఊహించి, జల్‌పల్లిలోని ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం(Actor Mohan Babu Jalpally residence) వద్ద పోలీసు బలగాలను మోహరించారు. ఇటీవలి రోజుల్లో ఉద్రిక్తతలు తగ్గినట్లు కనిపించినప్పటికీ, మంచు కుటుంబంలో వివాదాలు మరోసారి చెలరేగాయి.