11-12-2024 03:06:30 PM
వినయ్ వల్లే మా ఇంట్లో వివాదాలు
హైదరాబాద్: కుటుంబ కలహాలపై విచారణలో భాగంగా నటుడు మంచు మనోజ్ బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి హాజరయ్యారు. మనోజ్‌ను పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గంటన్నరకు పైగా ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన మనోజో మీడియాతో మాట్లాడారు. జనమూహానికి దూరంగా ఉండాలని, గొడవలు జరిగే పరిస్థితులకు కారణం కావొద్దని సీపీ సుధీర్ బాబు సూచించారని తెలిపారు. నాకు న్యాయం జరుగుతుందని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని మనోజ్ వెల్లడించారు. మా అమ్మ ఆస్పత్రిలో అడ్మిట్ అయిందన్నది అవాస్తం, ఇంట్లోనే ఉన్నారని మనోజ్ మీడియాకు చెప్పారు. మేమంతా కూర్చొని సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మా అన్న విష్ణు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాన్న స్కూల్ ను అక్కడ పెట్టారు. వినయ్ వైఖరి వల్లే మా ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని స్పష్టత ఇచ్చారు. వినయ్ తిరుపతిలో చేసే విషయాలు తనకు నచ్చడం లేదన్న మంచు మనోజ్ వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. విద్యానికేతన్ సంస్థల్లో వినయ్ చేసే అక్రమాలు నాన్నకు తెలియవని మంచు మనోజ్ పేర్కొన్నారు.