11-12-2024 11:37:26 AM
హైదరాబాద్: నిన్న తన తండ్రి మోహన్ బాబు దాడిలో గాయడిన జర్నలిస్టుకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు. మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించిన మనోజ్ నిరసన చేస్తున్న జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాడు. ''మా నాన్న తరుఫున, మా అన్న తరుఫున క్షమాపణలు చెప్తున్నా''అని పేర్కొన్నారు. తాను ఇంట్లోని వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదని, సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నామని వివరించాడు. ఆస్తుల కోసం మా నాన్నతో గొడవపడుతున్నాననేది వాస్తవం కాదని మంచు మనోజ్ పేర్కొన్నారు. ఈ వివాదంలో సంబంధం లేని తన భార్యను, 7 నెలల కుమారైను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు పోలీసుల విచారణకు హాజరవుతానని తెలిపారు. తాను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరా దృశ్యాలు చూపించండని ప్రశ్నించారు. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. గత రెండు రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ మరింత ముదిరి పాకాన పడుతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు తన జల్పల్లి ఫామ్‌హౌస్‌లో ఒక మీడియా వ్యక్తిపై దాడి చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.