calender_icon.png 4 March, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మంచు మనోజ్ విచారణ

11-12-2024 02:42:27 PM

హైదరాబాద్: పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో బిఎన్‌ఎస్ సెక్షన్ 329 (నేరమైన అతిక్రమణ) కింద బుక్ చేసిన కేసుకు సంబంధించి సినీ నటుడు మంచు మనోజ్ రాచకొండ పోలీసుల ఎదుట హాజరయ్యారు. కాసేపటి క్రితమే రాచకొండ సీపీ కార్యాలయంలో  మంచు మనోజ్ విచారణ ముగిసింది. గంటన్నర పాటు మనోజ్‌ను ప్రశ్నించన  పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు  వివరణ తీసుకున్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు తనకు సెక్షన్ 126 కింద జారీ చేసిన నోటీసుపై స్పందించి రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. సెక్షన్ 329(4), 115(2), 351(2) కింద 3(5) ప్రకారం క్రైమ్ నంబర్ 643/2024లో మనోజ్ ప్రమేయం ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) నివేదిక సమర్పించినట్లు నోటీసులో సుధీర్ బాబు తెలిపారు.