మంచిర్యాల, విజయ క్రాంతి : హైదరాబాదులోని గచ్చిబౌలిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి పెట్టం శ్రీనివాస్ కుమారుడు పెట్టం సాయి నివాస్ (25) మృతి చెందారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో రాత్రి విధులు నిర్వహించుకుని ఉదయం ఇంటికి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయి నివాస్ సింగరేణి ప్రాంతం వాసి కావడంతో నస్పూర్ కాలనీలోని న్యూ నాగార్జున క్వార్టర్స్ లో విషాద చాయలు అలుముకున్నాయి.