calender_icon.png 22 December, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ చెరువును పరిశీలించిన డిసిపి

12-09-2024 04:19:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పోచమ్మ చెరువును గురువారం మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. గణేష్ నిమజ్జనానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ ఆయన ఆదేశించారు. నిమజ్జనంలో ఎక్కడ గొడవలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని పోలీసులకు ఆయన సూచించారు. డీసీపీ వెంట బెల్లంపల్లి సిఐలు దేవయ్య,  అఫ్జలొద్దిన్, ఎస్సైలు రమేష్, మహేందర్, చుంచు రమేష్ లు ఉన్నారు.