మహిళా వసతి గృహాల వద్ద సిసి టీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు తప్పనిసరి
మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల,(విజయక్రాంతి): బాలికల, మహిళల రక్షణ, భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత, లక్ష్యం అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Eggadi Bhaskar) పేర్కొన్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్(Mancherial Police Station) పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలల ప్రిన్సిపాల్స్, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు బాలికల, మహిళా వసతి గృహాలకు సంబంధించిన బాధ్యులను, వార్డెన్ లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హాస్టళ్లలో తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యల గురించి, సీసీ టివి, కెమెరాల ప్రాముఖ్యత గురించి, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు గురించి వివరంగా చర్చించి తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. హాస్టల్ వద్ద తప్పనిసరిగా సిసిటీవీ కెమెరాలు 30 రోజుల నిలివిడి సామర్థ్యం కలిగినవి, రిసెప్షన్, కారిడార్, నలువైపులా పరిసరాలు క్షుణ్ణంగా కనిపించే విధంగా బిగించు కోవాలని సూచించారు.
హాస్టల్ పరిసరాలు వెలుతురు కలిగి ఉండాలని, హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. బాలికల ప్రవర్తన, వారి కదలికలు గమనిస్తూ వారితో ప్రేమగా మనసువిప్పి మాట్లాడి వారి మానసిక ప్రవర్తనను గమనించి వారికి ఏవైనా ఇబ్బంధులు ఎదురైతే తల్లి తండ్రి దృష్టికి తీసుకువెళ్లడం లేదా ఏదైనా ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే, హాస్టల్స్, వసతి గృహల ప్రాంతంలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపించనా, ఇబ్బందులకీ గురిచేస్తున్నారనే సమాచారం ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకు వస్తే తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల సీఐ ఎస్.ప్రమోద్ రావు, షీ టీం ఇంచార్జ్ హైమ, తదితరులు పాల్గొన్నారు.