calender_icon.png 14 March, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే మాస్టర్ కు అండగా..

13-03-2025 06:11:44 PM

మందమర్రి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సీనియర్ కరాటే మాస్టర్ కు జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేసింది. పట్టణ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రమాద బాధితునికి 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, కోశాధికారి కనగర్తి రమేష్ ను మాట్లాడారు.

జిల్లా లోని  శ్రీరాంపూర్ కి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం జరిగిన రోడ్ ప్రమాదంలో నడుము భాగంలో బలమైన దెబ్బ తగలటంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారని ఆపరేషన్ కు ఖ 2 లక్షలు అవుతాయని తెలి పారని ఆన్నారు. కరాటే ని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న బాదితుని ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండగా  విషయం తెలుసు కున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తమ తోటి మాస్టర్ కోసం 25000 రూపాయలు విరాళాలు సేకరించి బాదితు నికి అందచేశారు. ఈ కార్యక్ర మంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్ లు హరికృష్ణ, నరేష్, ప్రసాద్, రమేష్ రాజా, రవి, రాజేష్, శ్యామ్ లు పాల్గొన్నారు