calender_icon.png 25 September, 2024 | 11:50 PM

నిమిషాలో ్ల మన్బా ఫైనాన్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్

24-09-2024 12:00:00 AM

ముంబయి: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మన్బా ఫైనాన్స్ ఐపీఓ క్షణాల్లో పూర్తి సబ్‌‌‌రరస్కిప్షన్ అందుకుంది. సోమవారం ఉదయం దీని సబ్‌‌‌రరస్కిప్షన్ ప్రారంభం కాగా... కొన్ని నిమిషాల్లోనే పూర్తి సబ్‌‌‌రరస్కిప్షన్ అందుకుంది. మధ్య్యాహ్నం ఒంటి గంట సమయానికి 10 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైట్ అయ్యింది. ఐపీఓలో భాగంగా రూ.151 కోట్లు సమీకరించేందుకు 1.26 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచింది. ధరల శ్రేణిని రూ.114 - - రూ.120గా నిర్ణయించింది. కనీసం 125 ఈక్విటీ షేర్లకు సబ్‌‌‌రరస్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా వచ్చిన మొత్తాలను కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాలకు వినియోగించనుంది.

మన్బా ఫైనాన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కాగానే ఎస్‌ఐఐఐ కోటా నుంచి మంచి డిమాండ్ అందుకుంది. రిటైల్ పోర్షన్ కూడా క్షణాల్లో పూర్తయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్‌ఐఐ కోటా 20 రెట్లు సబ్‌స్ర్కైైబ్ కాగా. రిటైల్ పోర్టన్ 13.41 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైైబ్ అయ్యింది. క్యూఐబీ కోటా 1.16 రెట్లు బిడ్లు అందుకుంది.  నెల 25వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. దీంతో మరిన్ని బిడ్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మన్బా సహా ఈ వారం మొత్తం. 11 సంస్థలు ఐపీఓకు రానుండగా.. 14 సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.