calender_icon.png 18 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మానవతారాయ్

15-04-2025 09:58:30 PM

హైద్రాబాద్,(విజయక్రాంతి): దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు నమోదు చేశారు. నిన్న దుబ్బాకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కొత్త ప్రభార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యాలు తెలంగాణ తీవ్ర దుమారం రేపుతున్నారు.  దీంతో ఆయన వ్యాఖ్యాలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడ్డుతున్నారు. ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలను నిరసిస్తూ దుబ్బాకలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసి ఆయన దిష్టి బొమ్మను తగల బెట్టడంతో పాటు దుబ్బాక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలోనే టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఇవాళ సాయంత్రం బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ  జరిపి ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న పారిశ్రామిక వేత్తలు, బిల్డర్ల ను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతారాయ్ తో పాటు నిరుద్యోగ జేఏసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, నిరుద్యోగ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి నరేష్ గౌడ్, నిరుద్యోగ జేఏసి హైదరాబాద్ అధ్యక్షులు హేమంత్ చౌదరి తదితరులు ఉన్నారు.