‘మెరుపై వచ్చిండే.. మడ త పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే...’ అంటూ పక్కా మా స్ బీట్తో సాగే ఆ పాట సం గీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్ ది హంటర్’ సినిమాలోనిదే ఆ పాట. ‘మనసిలా యో..’ పేరుతో సందడి చేస్తున్న ఈ తాజా గీతం రజినీకాంత్, మంజు వారియర్ మధ్య వచ్చే పాట. సూపర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టు మరోసారి తనదైన పంథాలో బాణీలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్.. ఈ పాటలో రజనీతో స్టెప్పులేస్తూ కనిపించి, అందరితో స్టెప్పులేయిస్తున్నారు. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను నకష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేశ్ పాడారు.
ఈ పాట తమిళ వెర్షన్ కోసం ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మలేషియా వాసుదేవన్ వాయిస్‌ను ఏఐలో క్రియేట్ చేసి ఇందులో ఉపయోగించటం మరో విశేషం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న విడుదల కానుంది.