calender_icon.png 26 December, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణప్పురం బంగారం చోరీ కేసులో..

02-11-2024 02:33:20 AM

  1. నిందితుడి అరెస్ట్, సొత్తు స్వాధీనం
  2. వివరాలు వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ

వికారాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ వికారాబాద్ బ్రాంచ్‌లో ఇటీవల చోరీకి గురైన సుమారు 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. చోరీకి సూత్రధారి అయిన బ్రాంచ్ మేనేజర్ విశాల్‌ను అరెస్టు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.

శుక్రవారం ఎస్పీ కార్యా లయంలో ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 19న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ వికారాబాద్ బ్రాంచ్ కార్యాలయం లో పెద్ద ఎత్తున బంగారం చోరీకి గురైనట్లు ఆ సంస్థ రీజినల్ మేనేజర్ రవీందర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్‌ప్పెక్టర్ బలవం తయ్య..

చోరీకి గురైన ఆభరణాలను వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న విశాల్ దొంగలించినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. కాగా అతడు పరారీలో ఉన్న ట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అతడిని కర్ణాటక రాష్ట్రం ఔదర్ తాలూకాలోని నారాయణపూర్‌ంలో అరెస్టు చేశారు. అతడి వద్ద చోరీకి గురైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కాగా నిందితుడు కస్టమర్ల ఐడీపై రెండోసారి రూ.కోటి 24లక్షల వరకు లోన్లు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కస్టమర్లు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని.. నిందితుడి నుంచి చోరీకి గురైన అన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపా రు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.