calender_icon.png 6 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులకు.. నో రెస్సాన్స్!

04-01-2025 11:05:15 AM

రెవెన్యూ నోటీసులకు స్పందించని ఆర్ఎంసీ ప్లాంట్ల నిర్వాహకులు

అదేబాటలో క్రషర్ యజమానులు

ఏమాత్రం బెదరని అక్రమార్కులు

శంషాబాద్ మున్సిపల్, మండలంలో దర్జాగా సుమారు 45 నిర్వహణ 

చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ రవీందర్ దత్

రాజేంద్రనగర్: నోటీసులకు అక్రమార్కులు ఏమాత్రం బెదరడం లేదు. శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality)లోని కొత్వాల్ గూడతోపాటు మండల పరిధిలో నిర్వహిస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్లు, క్రషర్ల నిర్వాహకులకు 'విజయక్రాంతి' కథనంతో ఇటీవల తహసీల్దార్ రవీందర్ దత్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 25న 'విజయక్రాంతి' పత్రికలో(Vijayakranthi News paper) 'అడ్డగోలుగా ఆర్ఎంసీ ప్లాంట్లు' శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో స్పందించిన తహసీల్దార్ రవీందర్ డత్ సుమారు 4.5 ఆర్ఎంసీ ప్లాంట్లు, క్రషర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నిర్వాహకుల వద్ద ఉన్న అనుమతులు, ఇతర పత్రాలను తీసుకొని రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులు జారీ చేసి సుమారు నెలరోజులు కావొస్తున్నా అక్రమార్కుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

ప్రతీనెలా భారీగా ముడుపులు

శంషాబాద్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిచాలా ప్రాంతం 111 జీఓ విస్తరించి ఉంది. అడేవిధంగా ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్లు, క్రషర్ల ఏర్పాటు, నిర్వహణకు ఏమాత్రం అనుమతులు లేవు. అయినా కూడా దర్జాగా నిర్వహించడం గమనార్హం. ఆర్ఎంసీ ప్లాంట్లు, క్రషర్ల నిర్వాహకులు ప్రతీనెల ఠంఛన్ గా ఆయా విభాగాల అధికారులకు మామూళ్లు భారీ మొత్తంలో సమర్పించడంతో వారు ఆడించే ఆట.. పాడిందే పాట అనే చందంగా చూరింది. మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో వీటిని దర్జాగా నడపడంతో భారీగా దుమ్ముడూళి వస్తోంది.

భారీ కాలుష్యం ఏర్పడుతున్నా అడిగే నాథుడు కనిపించం లేడు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దృష్టిసారించి చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు(PCB officials) అవినీతి కాలుష్యంతో మునిగిపోయారు. తమకు అమ్యామ్యాలు సమర్పించుకుంటే చాలు అనేవిధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఆర్ఎంసీ ప్లాంటర్లు, క్రషర్ల ద్వారా ప్రతీమో అక్రమార్కులు కో రూపాయల సొమ్మును తమ జేబుల్లో నింపుకొంటున్నారు. ఈ విషయంలో పీసీబీ ఈఈ వెంకటనర్సును వివరణ కోరగా.. గతంలో క్రషర్లు, ఆర్ఎంసీ ప్లాంట్ల నిర్వహణ విషయంలో ఓ కమిటీ పర్యటించింది. వారి నివేదిక ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలుష్యం వెదజల్లుతున్న వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అనుమతులు లేకుంటే చర్యలు: తహసీల్దార్

కొన్నిరోజల క్రితం ఆర్ఎంసీ ప్లాంటు, క్రషర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అనుమతులు లేని వాటి విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు.కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవిషయంలో ఊరుకునేది లేదు. -రవీందర్ దత్, తహసీల్దార్ శంషాబాద్