calender_icon.png 30 October, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారులను మోసం చేసిన బ్యాంక్ మేనేజర్

17-07-2024 04:35:51 PM

నిజామాబాద్ : ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాల్సిన ఓ బ్యాంక్ మేనేజర్ ఖాతాదారులకు పంగనామాలు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని యూనియన్ బ్యాంకులో బుధవారం చోటు చేసుకుంది. మేనేజర్ అజయ్ ఖాతాదారులను నమ్మించి మోసం చేశాడు. దాదాపు 40 మంది ఖాతాదారుల అకౌంట్లోంచి భారీగా డబ్బు డ్రా చేసుకున్నాడు. దాదాపు రూ.5 కోట్లు స్వాహా చేసిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ ఖాతాదారులకు రుణాలు ఇచ్చేందుకు పలువురి నుంచి బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. వారి ఖాతాల్లో లోన్ నగదు బదిలీ కాగానే డబ్బులు డ్రా చేసుకున్నారు. తెనాలికి చెందిన  మేనేజర్ అజయ్ గత రెండేళ్లుగా నిజామాబాద్ లో బ్యాంక్ లో  విధులు నిర్వహిస్తున్నాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.