కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రైవేట్ కాలేజీల్లోని 30 శాతం మేనేజ్‌మెంట్ (బీ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేయాలని కాలేజీలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. ముం దస్తుగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ ప్రధాన పత్రికల్లో అడ్మిషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థు ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సూచించింది. అప్లికేషన్లను విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది. తమ మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్లు భర్తీ చేయాలని, లేకుం టే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాలేజీలు ఆగస్టు 9 లోపు నోటిఫికేషన్లు జారీచేయాలని, దరఖాస్తు చేసుకోవడానికి ఆరు రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్టు 29లోపు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 10లోపు అడ్మిషన్లు పొందిన వివరాలను తమకు సమర్పించాలని స్పష్టంచేసింది.