calender_icon.png 29 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహణ

27-01-2025 06:35:00 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా వై.సి.ఓ.ఎ మహిళాక్లబ్ లో సేవా, మహిళా క్లబ్ అధ్యక్షురాలు వి.రమ అధ్వర్యంలో బొమ్మల కొలువు కార్యక్రమం సోమవారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీమణి శారద బలరాం, డైరెక్టర్ పీపీ పా సతీమణి సునీతా వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఈ అండ్ ఎం సతీమణి హరిణి సత్యనారాయణ కొత్తగూడెం సేవా, మహిళా క్లబ్ అధ్యక్షురాలు మధురవాణి, మణుగూర్ సేవా, మహిళా క్లబ్ అధ్యక్షురాలు సుమ రామచందర్, జీఎం సెక్యూరిటీ సతీమణి రోజా లక్ష్మీనారాయణ హాజరై బొమ్మల కొలువులను ప్రారంభించారు. ఈ సందర్బముగా సంప్రదాయబద్దంగా, సందేశాత్మకంగా బొమ్మల కోలువులను ఏర్పాటు చేయటం అబినందనీయమని అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని ముందుతరానికి తెలియచేసే విధంగా ఉన్నాయని అతిధులు తెలిపారు. అనంతరం మహిళలు వేసిన రంగవల్లులను భద్రాచలం తెప్పోత్సవం సెట్టింగ్ లను పరిశీలించి పూజలు చేసారు. ఈ సందర్బముగా మహిళలు ఆటపాటలతో సందడి చేసారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.