19-04-2025 06:46:51 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి ఐసిడిఎస్ సిడిపీఓ మంగతారా పర్యవేక్షణలో టేకులపల్లి సెక్టార్ లో సెక్టర్ సూపర్వైజర్ కె.అనురాధ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం శనివారం నిర్వహించారు. మండలంలోని తొమ్మిదో మైలుతండా జిపిలో అంగన్వాడి కేంద్రంలో సిబి ఈవెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, వెయ్యి రోజులు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఒక గర్భిణీకి శ్రీమంతం అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ సూపర్వైజర్ విజయ, ఎఎన్ఎమ్ ఎల్లమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, జీపీ సెక్రటరీ కృష్ణకుమారి, తల్లులు, పిల్లలు, కిషోర్ బాలికలు, అంగన్వాడీ టీచర్స్ సంధ్య రాణి. నీ రోజా, రాంబాయి, నాగఫణి, ఆయా రాజి పాల్గొన్నారు. గంగారం సెక్టార్ పరిధిలోని చింతోనిచెలక, మద్రాస్ తండా సెక్టార్ పరిధిలోని కొండంగులబోడు, శాంతినగర్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వడా కార్యక్రమాలు నిర్వహించారు.