నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో వివిధ సంక్షేమల శాఖ ద్వారా నిర్వహించబడుతున్న గురుకులాల్లో ఎలాంటి లోటుపాటు లేకుండా గురుకుల విద్యాలయాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఆర్ సి ఓ లు ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. గురుకులాల్లో మంచి నానమైన భోజనం అందించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కోరారు. నాణ్యమైన కూరగాయలు నిత్యవసరకులు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్ మోహన్ సింగ్ రాజేశ్వర్ గౌడ్ ఆర్ సి ఓ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.