26-04-2025 08:47:09 PM
నాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక మన పాలసీ ఇసుక రిచ్ పర్మిషన్ ఒకచోట ఇస్తే ఇసుక ఎత్తేది మాత్రం మరోచోట అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వా నిబంధనల ప్రకారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో మన ఇసుక మన పాలసీ ఇసుక రిచ్ కు అనుమతి లభించింది. ఇసుక రిచ్ నిర్వహణకు ప్రత్యేకంగా సాండ్ రిచ్ ఆఫీసర్లను నియమించి ఇసుక పాలసి లో అవకతవకలు జరగకుండా చూసుకునే బాధ్యతను వారికి అప్పజెప్పింది. కానీ అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఆర్ ఓ మాత్రం అవేమి తమకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో పర్మిషన్ ఉంటే నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం శివారులో ఇసుక ఎత్తడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత జిల్లా అధికారుల స్పందించి రీచ్ లో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు.