21-03-2025 02:03:03 AM
వరంగల్ కలెక్టర్ సత్య శారద
వరంగల్, మార్చి 20 (విజయక్రాంతి): రైతుల కోసం మన అగ్రిటెక్ సంస్థ అందిస్తు న్న సేవలు బాగున్నాయని వరంగల్ కలెక్టర్ సత్యశారద కొనియాడారు. గురువారం ఎనుమాముల మార్కెట్‌లో ఆధునిక వ్యవసాయ పరికరాలతో ఏర్పాటైన మన అగ్రిటెక్ సంస్థను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు.
డ్రోన్ మేళాతో పాటు వివిధ స్టాళ్లను తిలకించారు. ఆధునిక పరికరాల వివరాలను సంస్థ అధినేత పాషికంటి రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. తమ సంస్థ ద్వారా ఎనిమిదేళ్లుగా ఆధునిక వ్యవసాయం లో రైతులకు అందిస్తున్న సేవలను ఛాయాచిత్రాల ద్వారా కలెక్టర్‌కు వివరించారు.
ము న్ముందు తాము అందించనున్న ఆధునిక వ్యవసాయ పరికరాలపై రైతులకు సబ్సిడీ సౌకర్యం కల్పించాలని మన అగ్రిటెక్ అధినేత రమేశ్ కలెక్టర్‌ను కోరారు. ఎనమాముల మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు పాల్గొన్నారు.