25-03-2025 12:19:11 AM
భువనగిరి పీడీజే కోర్టు సంచలన తీర్పు
యాదాద్రి భువనగిరి, మార్చి 24 (విజయక్రాంతి): క్షణికావేశంలో భార్యాభర్తల ను హత్య చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 20వేల జరిమానా విధిస్తూ భువనగిరి కోర్టు సోమవారం సం చలన తీర్పు వెల్లడించింది. కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతుడు, నిందితుడు రాసాల రాజమల్లు ఒకే వీధిలో ఉంటున్నారు.
మృతుడు పెంచుకుంటున్న గొర్రెల మంద రాజమల్లు ఇంటి ముందు నుండి ప్రతిరోజు వెళ్తుండడంతో వస్తున్న దుమ్మి, దూళి కారణంగా తరచుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగేటివి. 2023 సంవత్సరంలో ఇదే విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా నిందితుడు రాజమల్లు. మృతుడిపై దాడి చేయగా అడ్డువచ్చిన ఆయన భార్యపై కూడా దాడి చేయడంతో భార్యాభర్తలు ఇరువురు.
తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికి త్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు అప్పటి రూరల్ ఎస్సై, నిందితుడు రాసాల రాజమల్లును అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి బలమైన సాక్షాలతో కోర్టు ముందు ఉంచారు. రెండేళ్ల విచారణ అనంతరం పిడిజె కోర్టు నిందితునికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 20 వేల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు.