calender_icon.png 9 January, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 500 కోసం గొడవ.. గుత్తేదారు చేతిలో లేబర్ హత్య

30-12-2024 01:23:12 PM

వ్యక్తి దారుణ హత్య 

రాజేంద్రనగర్ బుద్వేల్ లో దారుణం 

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని బుద్వేల్ లో దారుణం జరిగింది. శ్రీనివాస్ అనే డైలీ లేబర్ ను గుత్తేదారు సాయి చంపేశాడు. ఇద్దరి మధ్య 500 రూపాయల విషయంలో గొడవ చోటుచేసుకుంది. ఈక్రమంలో శ్రీనివాస్ సాయిను తనకు ఇవ్వవలసిన 500 రూపాయల కొరకు తగాదాకు దిగాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆవేశానికి లోనైన సాయి పక్కనే ఉన్న డ్రైనేజ్ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అతడిని వెంటనే హాస్పటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.